Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 11:17:20
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతి సీజన్ అంటే కలిసొచ్చే కాలం. ఈ సీజన్ లో హిట్ కొడితే కలెక్షన్ల కనకవర్షం కురుస్తుంది. అందుకే హీరోలంతా ఈ టైంలో సినిమా రిలీజ్ చేయడానికి పోటీలు పడుతుంటారు. ఈ ఏడాది సంక్రాంతి రేసులో అజ్ఞాతవాసితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - జైసింహాతో నందమూరి బాలయ్య బరిలో దిగడానికి ముందే ప్రిపేరయిపోయారు.

ఏడాదిపైగా గ్యాప్ తీసుకుని తిరిగి రాజాది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన మాస్ మహరాజా కూడా సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ షూటింగ్ ఓ కొలిక్కొచ్చిన టచ్ చేసి చూడు మూవీని ఈ సీజన్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. రవితేజ గత సినిమాల్లో కృష్ణ - మిరపకాయ్ సంక్రాంతి టైంలోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అవిరెండూ సూపర్ హిట్టయ్యాయి. కాబట్టి సెంటిమెంటల్ గానూ ఈ సీజన్ కలిసొస్తుందని టచ్ చేసి చూడు మేకర్లు ఆశపడుతున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన మూవీతోపాటు అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న భాగమతిని కూడా సంక్రాంతి నాటికి థియేటర్లకు తీసుకురావాలన్నది ఆ చిత్రాల మేకర్ల ఆలోచనగా తెలుస్తోంది.

వాస్తవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ - డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న 2.0 రిలీజ్ ఉందన్న ఆలోచనతో ముందు సంక్రాంతి రిలీజ్ ఆలోచనలు పక్కనెట్టారు. ఇప్పుడు 2.0 రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో మిగిలిన నిర్మాతలంతా ఈ సీజన్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు.

,  ,  ,  ,