Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Aug-2016 13:30:46
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ మానియా మొదలైపోయింది. మరి కొద్ది గంటల్లో జ‌న‌తా గ్యారేజ్ బొమ్మ పడిపోతుంది. ప్రస్తుతం జనతా ఫీవర్ లో వున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వ‌సూళ్లు, రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు. అటు ఎన్టీఆర్ కూడా రిజల్ట్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో ఎన్టీఆర్ కు అనుకోని అతిధి పోన్ చేశారు. ఆయనెవరో కాదు. మెగా స్టార్ చిరంజీవి.

జ‌న‌తా గ్యారేజ్ థియేట‌ర్ ట్ర‌యిల‌ర్‌, టీజ‌ర్‌తోపాటు సాంగ్స్ బిట్స్ చూసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇంప్రెస్ అయ్యి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి అభినందించారాని తెలిసింది. విజువల్స్ చాలా ప్రెస్ గా వున్నాయని, సినిమా మంచి కంటెంట్‌తో ఉంద‌ని, అప్పియ‌రెన్స్‌, థీమ్? అన్నీ చాలా చక్కగా వున్నాయని కితాబిచ్చిన మెగా స్టార్, టీం మొత్తానికి అల్ ది బెస్ట్ చెప్పారని తెలిసింది.

రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ రోజు (31 )రాత్రికి ఈ సినిమా బెనిఫిట్ షో పడిపోతుంది

,  ,  ,  ,  ,