Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2016 11:39:49
facebook Twitter Googleplus
Photo

అ ఆ రిలిజై రెండు నెలలు దాటినా ఇంకా కొత్త సినిమా కబురు చెప్పలేదు నితిన్. నేను శైలజా ఫేం కిశోర్ తిరుమలతో ఓ కధ అనుకున్నాడు కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట నితిన్ . ఆయనెవరో కాదు సురేందర్ రెడ్డి. గతంలో ఈ దర్శకుడికి నితిన్ ఫాథర్ సుధాకర్ రెడ్డి అడ్వాన్స్ ఇచ్చారని, ఇప్పుడు వీరి కాంబినేషన్ మూవీ వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు.

సురేందర్ రెడ్డి సినిమా అంటే యాక్షన్ ?కిక్?. నితిన్ కూడా ఇలాంటి సినిమాలు చేశాడు. అయితే అవి పెద్దగా ఫలితాల్ని ఇవ్వలేదు. ఇష్క్ తో మళ్ళీ గాడిన పడి తనకు నప్పే సినిమాలు చేసుకుంటుపోతున్నాడు. అయితే సురేందర్ రెడి టేకింగ్ పై నితిన్ కు పూర్తి నమ్మకం వుందట. తనను ఖచ్చితంగా సరికొత్త గా చుపిస్తాడని భావిస్తున్నాడు నితిన్. ప్రస్తుతం చరణ్ తో ధ్రువ చేస్తున్నాడు సూరి. ఈ సినిమా పుర్తయ్యాక నితిన్ సినిమా లైన్ లోకి వస్తుందని చెబుతున్నారు.

,  ,  ,  ,  ,