Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 11:59:18
facebook Twitter Googleplus
Photo

ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తాయి అలాగే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కూడా ఉంటాయి. అలాంటి ఓ అపురూపమైన కాంబినేషన్ ఇప్పుడు మరోసారి సెట్ అవుతోంది. కమల్ హాసన్ మూవీ అంటేనే ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అలాంటిది కమల్ కి ఇళయరాజా తోడయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కమల్ నెక్ట్స్ మూవీకి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది.

11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తుండడం విశేషం. 2005లో ముంబై ఎక్స్ ప్రెస్ తర్వాత.. తొలిసారిగా కమల్-ఇళయరాజా కలిసి పని చేయనున్నారు. వీరిద్దరు కలిస్తున్నారనే విషయం బైటకు రాగానే.. ఈ ప్రాజెక్ట్ కి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆసక్తి ఏర్పడిపోయింది. టీకే రాజీవ్ దర్శకత్వంలో.. ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో కమల్ హాసన్ కి భార్యగా రమ్య కృష్ణ నటిస్తుండగా.. కూతురుగా శృతిహాసన్ నటిస్తుండడం విశేషం.

కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజకమల్ ఇంటర్నేషనల్ పై తెరకెక్కించనున్న చిత్రంలో.. వీరితో పాటు మరింతమంది సీనియర్ నటులు పని చేయనున్నారట. వీటన్నిటికి తోడు.. ఇప్పుడు ఇళయారాజా కూడా బోర్డ్ మీదకు రావడంతో మూవీపై ఆసక్తి పదింతలైందని చెప్పచ్చు.

,  ,  ,  ,  ,  ,  ,  ,