Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Mar-2017 13:10:05
facebook Twitter Googleplus
Photo

క్రేజ్ ను ఎంతలా సొమ్ము చేసుకోవాలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు జక్కన్నకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. ఏళ్లకు ఏళ్లు శిల్పాన్ని చెక్కినట్లుగా సినిమాను తీసే జక్కన్న.. అంతేసి టైం తీసుకుంటే సినిమా మీద ఇంట్రస్ట్ ఎలా ఉంటుందన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారు.కానీ.. జక్కన్న మైండ్లో ఉండే ఐడియాల ఫ్యాక్టరీకి ఇలాంటివేమీ పెద్ద అవాంతరాలుగా ఉండవు.

ఎప్పుడా.. ఎప్పుడూ అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి చిత్రానికి సంబంధించినట్రైలర్ ను ఈ నెల 16న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ట్రైలర్ మీద ఆసక్తిని రెట్టింపు చేసేందుకు జక్కన్న అనుసరిస్తున్న విధానాన్ని చూస్తే.. ఆయన ప్రచార వ్యూహాన్ని పొగడకుండా ఉండలేం. మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్ కు సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు.

పన్నెండు సెకన్ల నిడివి ఉన్నవీడియోను రిలీజ్ చేసినప్పటికి ఇందులో సినిమాకు సంబంధించి కనిపించే బొమ్మలు కేవలం మూడు సెకన్లు మాత్రమే. ముఖం మీద నుంచి రక్తం కారుతున్న ప్రభాస్ ను.. అది కూడా సగం మాత్రమే కనిపించే కట్ చేసి విడుదల చేసి ఊరించేశారు. పన్నెండు సెకన్ల వీడియోను చూద్దామనుకుంటే..మూడు సెకన్ల బొమ్మలు మాత్రమే చూపించి..మరింత చూడాలన్న ఆసక్తిని పెంచేశారు రాజమౌళి.

,  ,  ,  ,