Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 10:16:47
facebook Twitter Googleplus
Photo

బోనులో ఉన్న పులిని బయట నుండి ఎవడైనా చూస్తాడు.. కాని లోపలకెళ్ళి చూసేవాడే పోటుగాడు..'' అంటాడు హీరో ఆది. ఈ డైలాగ్ బాగా ఓవర్ గా ఉందిరా అని ఒక ఫ్రెండ్ అంటే.. ''ఆడియన్సుకు ఆ మాత్రం లేకపోతే కనెక్ట్ అవ్వట్లేదురా'' అంటూ మరో పంచ్. ఇంకో సీన్లో కమెడియన్ ఆలీ మాట్లాడుతూ.. ''తమన్ కి డప్పులు వాయించడం నేర్పించి.. బ్యాడ్ టైమొచ్చి బ్యాండు వాయించుకుంటున్నా'' అంటూ కంపోజర్ తమన్ మీద పంచ్. మొత్తంగా రొటీన్ హీరోయిజమ్.. సెటైరికల్ పంచులతో.. అచ్చం తన పాత సినిమాలనే మళ్లీ చూపిస్తున్నాడు ''చుట్టాలబ్బాయి'' ట్రైలర్ తో.

గత రాత్రి విడుదలై ఆడియోను పురస్కరించుకుని.. ఇప్పుడు ''చుట్టాలబ్బాయి'' ట్రైలర్ కూడా విచ్చేసింది. ''భాయ్'' సినిమాతో ఘోరంగా దెబ్బతిన్న దర్శకుడు వీరభద్రం.. మరోసారి సేమ్ టు సేమ్ అలాంటి పంచులే ప్రయత్నించాడు. హీరో సంగతి పక్కనెడితే.. హీరోయిన్ నమితా ప్రమోద్ కాస్త ఇంప్రెసివ్ గానే ఉంది. మిగిలిన జబర్దస్త్ గ్యాంగ్ అంతా ఓకె. ఇక ''ఈగో రెడ్డి'' అంటూ కమెడియన్ పృథ్వి ఒక కొత్త పాత్రలో మెరిసినట్లున్నాడు. కాకపోతే పంచులన్నీపాతవే. గతంలో వచ్చిన టీజర్ లో నెలవారి క్రెడిట్ కార్డు ఈ.ఎం.ఐ. వసూలు చేసుకునే కుర్రాడిగా ఆది పాత్రను బాగానే చూపించారు కాని.. అసలు ట్రైలర్ వచ్చేసరికి ఆ ఫీల్ అంతా మిస్సయ్యింది. ఓ యాంగిల్లో చూస్తే.. ట్రైలర్ కంటే టీజరే బాగుంది అంటున్నారు సినిమా లవర్స్.

,  ,  ,  ,  ,