Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2017 10:30:01
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరంటే.. మరో మాట లేకుండా దాసరి నారాయణ రావు పేరు చెప్పేయొచ్చు. 150 సినిమాలు తీసిన దిగ్గజ దర్శకుడాయన. అందులో ఎన్నెన్ని కళాఖండాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమాకు దిశా నిర్దేశం చేసిన దిగ్గజ దర్శకుల్లో ఆయనొకరు. అందుకే ఆయన్ని మన ఇండస్ట్రీ జనాలు అమితంగా గౌరవిస్తారు. ప్రేక్షకుల్లోనూ ఆయనపై ఎంతో గౌరవ భావం ఉంది. దాసరి పుట్టిన రోజు వచ్చిందంటే అది సినీ పరిశ్రమకే ఒక పండగలాగా ఉంటుంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఇండస్ట్రీ జనాలంతా దాసరి ఇంటికి వరుస కట్టేస్తారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పి.. ఆశీర్వాదాలు తీసుకుంటారు.

మామూలుగానే దాసరి పుట్టిన రోజు నాడు ఆయన ఇల్లు కళకళలాడిపోతుంది. ఈసారి ఆయన పుట్టిన రోజు మరింత ప్రత్యేకంగా మారింది. కొన్ని నెలల కిందట దాసరి తీవ్ర అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అప్పుడు పరిస్థితి ఎంతో విషమించింది. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆందోళనకు గురైంది. ఐతే అదృష్టవశాత్తూ దాసరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రెండు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉండి.. పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతుడిగా బయటికి వచ్చారు. ఇది ఒకరకంగా దాసరికి పునర్జన్మ లాంటిదే. అందుకే ఈ పుట్టిన రోజును ఆయనతో పాటు అందరూ చాలా ప్రత్యేకంగా భావిస్తున్నారు. మరింత ఉత్సాహంగా.. భారీగా దాసరి పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,