Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2015 17:49:28
facebook Twitter Googleplus
Photo

ఆమధ్య పూరి జగన్నాథ్ ని దాసరి నారాయణరావు ఆకాశానికి ఎత్తేసిన విషయం తెలిసిందే. ?ఈ తరం దర్శకుల్లో నాకు నచ్చినవాడు?.నా శిష్యుడు? అంటూ మెచ్చుకొన్నాడు. అంతలో ఏమైందో ప్లేటు తిప్పేశాడు. ఈమధ్యన ఇడియట్ తో హీరో అనే పదానికి అర్ధం మారిపోయింది. తల్లితండ్రులతో వెటకారంగా మాట్లాడేవాడు, అమ్మాయిలని రోడ్డుపై ఏడిపించే వాడు హీరో అయిపోయాడు అంటూ ఓ సెటైర్ వేశాడు. పూరి వల్లే ట్రెండ్ అలా తప్పుదారి పట్టిందని చెప్పకనే చెప్పాడు.

నేరుగా పూరినే టార్గెట్ చేస్తూ చేసిన ఈ కామెంట్స్ కాస్త చిత్ర సీమలో కలకలం రేపుతున్నది. దాసరికి, పూరికి మధ్య ఏమైనా చేడిందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దాసరి బడా హీరోలతో, దర్శకులతో సినిమాలు చేయాలనీ ఇటీవల ఆ ప్రయత్నాలలో ఉన్నారు. ఈ సందర్భంలోనే పూరిని పిలచి, ఓ సినిమా చేయమని అడిగారని, దానికి పూరి ఎ సమాధానం చెప్పకుండా, విషయాన్నీ తేల్చక నాన్చుడి ధోరణిలో ఉన్నాడని, పూరి వ్యవహారం బొత్తిగా నచ్చక, దాసరి అప్ సెట్ అయ్యాడని టాలీవుడ్ టాక్. అందుకే?.ఇలా పూరి పై సెటైర్ వేశాడని చెప్పుకొంటున్నారు. నిజమెంతో పూరికి దాసరికే తెలియాలి.

,  ,