Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Oct-2015 16:35:37
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దాసరి దర్శకత్వంలోని సినిమా! ఇది వినడానికే ఎంతో ఇంట్రెస్టింగ్ గా లేదూ!! ఇదే జరిగితే అద్భుతంగా ఉంటుంది కదూ? అసలే దాసరి ఇటీవలి కాలంలో పరాజయాల బాటలో ఉన్నారు. వరుసగా ఫ్లాప్ లిచ్చారన్న బ్యాడ్ టాక్ ఉంది. అలాంటప్పుడు ఆయన పవన్ని డైరెక్ట్ చేస్తే ఔట్ పుట్ ఎలా ఉంటుంది? అన్న ఆసక్తి అందరిలోనూ కుతూహాలం పెంచుతోంది.

అయితే దర్శకరత్న దాసరి ఈ సినిమాకి దర్శకత్వం వహించినా పవర్ స్టార్ అతడికి కో ఆపరేట్ చేసినా అందులో తప్పేం లేదు. ఎందుకంటే పవర్ స్టార్ ఛరిష్మాతో నే ఈ సినిమా హిట్టెక్కుతుంది. దానికి దాసరి అనుభవం జోడించి సరైన పంథాలో వెళితే దాసరి గతానుభవాల నుంచి జాగ్రత్త తీసుకుని ముందే స్ర్కిప్టు పరంగా కేర్ తో ఉన్నారు కాబట్టి ఈసారి దాసరిపై వచ్చిన అపప్రద తొలగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. షాక్ తీసిన హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తీసిన చందంగా ఎర్రబస్సు తెరకెక్కించిన దాసరి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తీయడం కష్టమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవలి కాలంలో పవర్ స్టార్ జూబ్లీ హిల్స్లోని దాసరి ఇంటికి స్టోరీ డిష్కసన్ కోసం రెగ్యులర్ గా వెళ్లి వస్తున్నారు. ఈ ప్రాజెక్టు పై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఈ స్ర్కిప్టు విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని పనిచేస్తున్నారు. సరిగ్గా ఆ సందర్భంలోనే పవన్ ఓ మాట అన్నారుట. దాసరిగారూ మీరే ఈ సినిమాకి ఎందుకు దర్శకత్వం వహించెకూడదు? జయాపజయాలు సహజం. వాటి గురించి బెంగ వద్దు అన్నారుట. అదీ సంగతి.

,  ,  ,