Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 13:47:07
facebook Twitter Googleplus
Photo

తెలుగు ప్రేక్షకులను కూడా తెగ ఆకట్టేసుకున్న తమిళ హీరో ఆర్య. గతంలోనే వరుడు వంటి చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన ఈ హీరోకి.. కొత్తదనం ఉండే కథలంటే మహా మక్కువ. తన కేరక్టర్ లో నావెల్టీ పాయింట్ ఉందంటే.. మిగిలిన ఎలాంటి అంశాలను.. హీరోయిజం లాంటి వాటిని పట్టించుకోకుండా సినిమా చేసేస్తుంటాడు.

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి మూవీని తమిళ్ లో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళ్ లో రూపొందించేందుకు ఆసక్తి చూపడమే కాదు.. తనకు చెందిన వండర్ బార్ ఫిలిమ్స్ సంస్థ ద్వారా రీమేక్ హక్కులు కూడా కొనేశాడని అన్నారు. అయితే.. ఈ రీమేక్ లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అయిన ధనుష్ నటించబోవడం లేదట. మరో తమిళ హీరో ఆర్యతో ఈ పాత్ర చేయించాలని చూస్తున్నాడట ధనుష్. ఇప్పటికే తన ప్రపోజల్ ను ఆర్యకు పంపాడని కూడా తెలుస్తోంది.

తెలుగు సినిమాల్లో అత్యంత బోల్డ్ క్యారెక్టర్ గా గుర్తింపు పొందిన అర్జున్ రెడ్డి పాత్రలో నటించేందుకు చాలామంది తమిళ నటులు ధైర్యం చేయలేదు. కానీ ఆర్య మాత్రం అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లో కనిపించేందుకు సై అన్నట్లుగా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,