Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2017 14:00:33
facebook Twitter Googleplus
Photo

తెలుగులో మొదలైన రియాలిటీ టివి షో ఇప్పుడిప్పుడే కొంచం ఆసక్తి గా మారుతోంది. ఈ షో ప్రచారం కానివ్వండి అందులో కంటెస్టంట్ లును పరిచయం చేయడంలో కానివ్వండి కొంచం అతి చేసిన బిగ్ బాస్ టీమ్ ఆ తరువాత అంతగా ఆకట్టుకోలేక పోయింది. అందులో ఉన్న నటులతో కొన్ని వివాదాలు కూడా జరిగాయి. అయితే అవన్నీ గేమ్ షో లో భాగం అని చెబుతున్నారు బిగ్ బాస్ టీమ్. ఇప్పుడు బిగ్ బాస్ షో కి వైల్డ్ కార్డ్ ఉపయోగించి మొదటి కంటెస్టంట్ బిగ్ బాస్ ఇంటి లోకి తీసుకువచ్చే సమయం వచ్చింది.

ఈ షో మొదలై రెండు వారాలు అయ్యింది కానీ ఇంత వరకు ఎటువంటి మలుపులు జరగలేదు. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ద్వారా ఆ అవకాశం రాబోతుంది అని తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ తో ఒక సినిమా అందాన్ని బిగ్ బాస్ ఇంటిలోకి తీసుకుని వెళ్లబోతున్నారు. దీక్షా పంక్త్ అనే చిన్న హీరోయిన్ బిగ్ బాస్ లోకి రాబోతుంది. దీక్షా ‘గోపాల గోపాల’ లో దొంగ మాతగా నటించింది. ఇంకా ‘ఒక లైలా కోసం’ సినిమాలో కూడా నటించింది. అలాగే ధనరాజ్ హీరోగా చేసిన ‘బంతి పూల జానకి’ సినిమాలో హీరోయిన్ గా కూడా కనిపించింది. ఈమెకు తెలుగులో మంచి పట్టు ఉందట.. అందుకే కాబోలు ఇప్పుడు ఈమెను బిగ్ బాస్ ఇంటిలోకి తీసుకురాబోతున్నారు. పైగా గ్లామర్ కూడా దట్టిస్తుందని వారి ఆశ.

ఈమె ఎంట్రీ పక్కన పెడితే కామిడీ యాక్టర్ ధనరాజ్ బిగ్ బాస్ షో ద్వారా మంచి ఫేమస్ అయ్యాడు. ముందు కూడా తెలుగు కామిడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు టివి ప్రేక్షకులు ఆ తరువాత సినిమా ప్రేక్షకులుకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ షో లోకి ఇప్పుడు దీక్షా పంక్త్ వస్తే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.

,  ,  ,  ,