Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-May-2016 11:02:05
facebook Twitter Googleplus
Photo

మోడరన్‌ సినిమా పతాకంపై ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో విజయవర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో రూపుదిద్దుకున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పదిమంది నూతన నటీనటులను పరిచయం చేస్తూ కంప్లీట్‌ యూత్‌ఫుల్‌ ట్రెండీ ఫిల్మ్‌గా రూపొందిన 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' చిత్రాన్ని టెక్నికల్‌ హై స్టాండర్డ్స్‌లో నిర్మించారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ - ''హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ప్రజెంట్‌ ట్రెండ్‌కి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికంటే ఎన్నో రెట్లు ఔట్‌పుట్‌ వచ్చింది. దర్శకుడుగా ఈ చిత్రం నాకు మంచి పేరును తెస్తుంది. కథ, కథనం అందర్నీ ఆకట్టుకునేలా ఈ చిత్రం వుంటుంది. యూత్‌ఫుల్‌ మూవీస్‌లోనే ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.
చిత్ర నిర్మాణ నిర్వాహకులు, సహనిర్మాత విజయవర్మ పాకలపాటి మాట్లాడుతూ - ''సోషల్‌ మీడియాకు యువత బానిసలుగా ఎలా మారుతున్నారు? దాని వల్ల ఏర్పడే అనర్థాలు ఏమిటి? అనే ఓ కొత్త పాయింట్‌తో ఈచిత్రాన్ని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం యూత్‌ ఆలోచనలు, అభిరుచులకు అద్దం పట్టేలా అందరూ కొత్త నటీనటులతో అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అంతా కొత్తవారితో చేసినప్పటికీ మేకింగ్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాటోగ్రఫీ నుంచి అన్ని టెక్నికల్‌ అంశాల్లోనూ స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాం. హై బడ్జెట్‌ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో చిత్రీకరించడం జరిగింది. 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' అనే టైటిల్‌కి సోషల్‌ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా ఒక కొత్త పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ ఫ్రెష్‌ ఫీల్‌ని కలిగిస్తుంది. జూన్‌ నెలాఖరులో వరల్డ్‌ వైడ్‌గా మా 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
ఆదిత్య ఓం ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శీతల్‌, మనీషా కేల్కర్‌, రిచా సోని, సాగరిక చైత్రి, ప్రకాష్‌, రోహిత్‌, నితేష్‌ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి మాటలు: రాఘవ, సంగీతం: లవన్‌ వీరన్‌, కెమెరా: సిద్ధార్థ్‌, సహనిర్మాత, నిర్మాణ నిర్వహణ: విజయవర్మ పాకలపాటి, నిర్మాణం: మోడరన్‌ సినిమా, కథ, దర్శకత్వం: ఆదిత్య ఓం.

,  ,  ,  ,  ,