Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Aug-2015 17:29:53
facebook Twitter Googleplus
Photo

దేవాకట్టా.. తెలుగు సినీ పరిశ్రమలో ?వెన్నెల?, ?ప్రస్థానం? లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శక రచయిత. ఓ బలమైన కథాంశం చుట్టూ అంతే బలమైన ఎమోషన్‌ను జోడించి సినిమాలు తీసే దేవాకట్టా, ప్రస్తుతం డైనమైట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్‌లో ?డైనమైట్? విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేవాకట్టా తనదైన స్టైల్లో రూపొందిన ఓ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
ఇక ఈమధ్య కాలంలో బాలీవుడ్ దర్శకులతో పాటు, తెలుగు దర్శకులు తమకు తోచిన ఓ బలమైన చిన్న పాయింట్‌ను షార్ట్‌ఫిల్స్మ్‌గా రూపొందించే సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గతేడాది కూడా స్వాతంత్ర్య దినోత్సవం దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్‌తో కలిసి చేసిన ?ఐ యాం దట్ చేంజ్? అనే షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవాకట్టా మళ్ళీ ఆ సంప్రదాయాన్ని అందిపుచ్చుకోవడం విశేషంగా కనిపిస్తోంది. సింగర్ స్మితతో కలిసి దేవాకట్టా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఆగష్టు 15న ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది.

,  ,  ,