కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను అందించడంలో ఎప్పుడూ ముందుండే బ్యానర్ సూపర్‌గుడ్ ఫిలింస్. ఈ సంస్థ అధినేత ఆర్బీ చౌదరి సమర్పణలో శ్రీనివాస్ రవీంద్ర(ఎంఎస్ఆర్) దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్ నిర్మించిన చిత్రం ?ద్వారక?. విజయ్ దేవరకొండ, పూజా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆర్బీ చౌదరి మాట్లాడుతూ- ??మా బ్యానర్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్స్‌ని, టెక్నీషియన్స్‌ని పరిచయం చేశాం. ?ద్వారక?తో శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తు న్నాం.
ప్రద్యుమ్న, గణేష్‌లతో కలిసి ఈ చిత్రానికి అసోసియేట్ అవడం ఆనందంగా ఉంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. అందరూ చూసేలా ఈ సినిమా ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం?? అన్నారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు అందించే చౌదరిగారితో కలిసి ఈ చిత్రం చేసినందుకు హ్యాపీగా ఉంది?? అని ప్రద్యుమ్న పేర్కొన్నారు. శ్రీనివాస్ రవీంద్ర, విజయ్ దేవరకొండ, పూజా జవేరి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, మాటల రచయిత లక్ష్మీభూపాల్ తదితరులు పాల్గొన్నారు.