Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Aug-2017 15:49:20
facebook Twitter Googleplus
Photo

కథ మాటలు నటీనటుల నటన ఎంత అవసరమో ఆ సినిమా భావాన్ని మరింత గొప్పగా చెప్పడానికి సినిమాలో ఉండే మరో ఆయుధం సంగీతం. ఆ సంగీతంతో కథను ఆ పాత్రలోని లోతైన భావాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయవచ్చు వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండి పోయే విదంగా చెప్పవచ్చు. తెలుగులో ఒక డైరెక్టర్ తన సినిమాకు మ్యూజిక్ గురించి ఆలోచిస్తే ముందు గుర్తుకు వచ్చేది రాక్ స్టార్ గా పాపులర్ అయన దేవి శ్రీ ప్రసాద్. తెలుగు తెరపై 17 ఏళ్ళు గా సరిగమలు పలికిస్తూనే ఉన్నాడు. ఒక మీడియా ఇంటర్వ్యూ లో తన కథకు సంగీతం ఎలా ఇస్తాడో తనపై డైరెక్టర్లు హీరోలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో వివరిస్తున్నాడు.

దేవి శ్రీ మాట్లాడుతూ నేను ఏదైనా ఒక సినిమాకు సంగీతం ఇచ్చే ముందు ఈ సినిమా కథను పూర్తిగా అర్ధం చేసుకుంటాను. ఆ సినిమా డైరెక్టర్ తో కూర్చొని కనీసం ఒక ఆరు గంటలు కథను వింటాను. మన తెలుగు డైరెక్టర్లు అయన త్రివిక్రమ్ - హరీష్ శంకర్ - వి వి వినాయక్ నాకు కథ చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే నేను కథను బాగా వింటాను అని వాళ్ళకి తెలుసు పైగా వాళ్ళు అలా చెబుతూ ఉంటే ఆ పాత్రలు నాకు బాగా అర్ధమై మ్యూజిక్ దానికి తగ్గట్లుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు నా అభిప్రాయాలూ అడుగుతూ ఉంటారు. అని చెప్పాడు. అలాగే తన పాటలుకు లిరిక్స్ విషయంలో కూడా నా డైరెక్టర్లు నాపై మంచి నమ్మకం పెట్టుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం ఖైదీ 150 సినిమాలో ఫేమస్ పాట అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాట నేను అలా రాసిందే అని చెప్పాడు.

ఆ సినిమాలో ఆ పాట సందర్భం విన్న తరువాత వెంటనే నాకు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే మాట అనిపించింది. దాన్నే చిరంజీవిగారికి చెబితే బాగుంది ఆ లైన్ ను ఉంచి మిగతా లిరిక్స్ రాయిద్దం అన్నారు. బాగా ప్రయత్నాలు చేశారు కానీ ఎవరు ఆ మాటకు తగ్గట్లు రాయలేకపోయారు. మెగాస్టార్ కి సంతృప్తి రాకపోయేసరికి చివరకు నన్నే రాయమన్నారు ఆ పాటను.

,  ,  ,  ,