Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2016 10:35:56
facebook Twitter Googleplus
Photo

సూర్య లేటెస్ట్ మూవీ ఎస్-3 టీజర్ చూస్తే.. సింగం సిరీస్ లో అంతకుముందు వచ్చిన రెండు సినిమాలకు ఇది ఏమాత్రం తగ్గదనే అనిపించింది. సూర్య నుంచి మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నట్లే కనిపిస్తోంది. హరి మరోసారి తనదైన స్పీడ్ చూపించాడు టీజర్లో. సినిమాలో యాక్షన్ మరీ ఎక్కువైనట్లుందని.. టీజర్ మరీ లౌడ్ గా ఉందని.. కొంత విమర్శలు వ్యక్తమైనప్పటికీ మాస్ ప్రేక్షకులు.. ?సింగం? లవర్స్ మాత్రం ఈ సినిమా మీద బాగా ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లను టీజర్ ఏ స్థాయిలో ఆకట్టుకుందో చెప్పడానికి దీనికి వస్తున్న వ్యూసే నిదర్శనం.

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ?కబాలి? తర్వాత అత్యంత వేగంగా 30 లక్షల వ్యూస్ సంపాదించుకున్నది ?ఎస్-3? తమిళ టీజరే. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ మార్కును అందుకుంది ?ఎస్-3? టీజర్. ప్రస్తుతం ?ఎస్-3? టీజర్ 40 లక్షల మార్కును దాటేసింది. తెలుగు టీజర్ కూడా మిలియన్ మార్కు దిశగా సాగుతోంది. అంటే రెండు రోజులు పూర్తి కాకుండానే ?ఎస్-3? టీజర్ 5 మిలియన్ మార్కును టచ్ చేసేస్తుందన్నమాట. సూర్య ఫాలోయింగ్ సౌత్ ఇండియాలో ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి రుజువు. తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న సూర్య.. వాటిలో సరైన విజయాలందుకోలేదు. ?సింగం-3? లాంటి పక్కా మాస్ మసాలా సినిమాతో సూర్య మళ్లీ ఓ బ్లాక్ బస్టర్ అందుకునేలా ఉన్నాడు. ఈ చిత్రం డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. తన కజిన్ జ్నానవేల్ రాజాతో కలిసి సూర్యనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.

,  ,  ,  ,  ,  ,