Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jul-2017 12:25:31
facebook Twitter Googleplus
Photo

ఏడాదిగా తమిళ హీరో ధనుష్ ను ఓ వివాదం వెంటాడుతోంది. ధనుష్ తమ కొడుకే అంటూ మధురైకి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు కోర్టులో పోరాడుతున్నారు. ముందు ఇదేదో సిల్లీ వ్యవహారం అనుకున్నారు కానీ.. తర్వాత అది సీరియస్ ఇష్యూ అయింది. ధనుష్ పుట్టు మచ్చల్ని.. అతడి సర్టిఫికెట్లనూ కోర్టు పరిశీలించే వరకు కేసు వెళ్లింది. చాన్నాళ్లుగా ఈ కేసు కోర్టులో నానుతూ వస్తోంది. ఇంకా అది ఓ కొలిక్కి రాలేదు. ఐతే ఇప్పటిదాకా ఈ వివాదానికి సంబంధించి ధనుష్ వెర్షన్ ఏంటన్నది తెలియరాలేదు. దానిపై మాట్లాడటానికి ధనుష్ ఇష్టపడట్లేదు. తమిళ మీడియా వాళ్లు దీనిపై ప్రశ్నలడిగినా సైలెంటుగా ఉంటున్నాడు.

ఐతే తన కొత్త సినిమా ‘వీఐపీ-2’ను తెలుగులో ప్రమోట్ చేయడం కోసం వచ్చిన ధనుష్ కు ఆ వివాదంపై ప్రశ్నలు ఎదురవడంతో అతను స్పందించక తప్పలేదు. ఆ దంపతులు కోర్టుకు ఆధారాలు కూడా సమర్పించడంపై ధనుష్ స్పందిస్తూ.. ‘‘ఈ రోజుల్లో ఇలాంటి ఆధారాలు సృష్టించడం కష్టమా? మార్ఫింగ్.. ఫొటో షాప్ ద్వారా నిజమైన వాటిలాగా ఫొటోల్ని మార్చడం చాలా ఈజీ. మా దగ్గర ఫొటోలున్నాయంటూ.. ఆ దంపతులు చూపించినప్పుడు నేను.. నా భార్య.. ఇతర కుటుంబ సభ్యులు నవ్వుకున్నాం. దీనిపై ఇంతకుమించేమీ మాట్లాడను. ఇలాంటి వివాదాలు ఎదురైనపుడు సెలబ్రెటీ స్టేటస్ ప్రమాదమే అనిపిస్తుంది. కానీ ఈ స్టేటస్ అందరికీ రాదన్న విషయం గుర్తుంచుకోవాలి. లక్షలాది మంది అభిమానం సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు.

,  ,  ,  ,  ,