Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 10:24:08
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ మూవీ ధృవ విడుదల ఆలస్యం అవుతోందంటూ వార్తలు వచ్చాయి. డిసెంబర్ 2న విడుదల కావాల్సిన ఈ మూవీ.. డిసెంబర్ 9కి వాయిదా పడిందని.. లాంగ్ వీకెండ్ కోసం ఇలా రిలీజ్ డేట్ మార్చుతున్నారనే వార్తలొచ్చాయి.

అయితే.. ఇవన్నీ రూమర్లే తప్ప వాస్తవలం లేదని తెలుస్తోంది. తన మూవీ రిలీజ్ కి.. మెగాస్టార్ చిరంజీవి మూవీ రిలీజ్ కి మధ్య నెల రోజులకు పైగా గ్యాప్ ఉండాలని ముందే ఫిక్స్ అయ్యాడట రామ్ చరణ్. అందుకే డిసెంబర్ తొలివారంలోనే ధృవను షెడ్యూల్ చేశారట. ఇలా చేయడం ద్వారా.. జనవరి 11న విడుదలయ్యే చిరు మూవీ ఖైదీ నెంబర్ 150 కి.. ఐదు వారాల సమయం ఉంటుంది. ఇప్పుడు చెర్రీ మూవీని ఆలస్యం చేస్తే.. ఈ గ్యాప్ 4 వారాలకు తగ్గిపోతుంది. అందుకే తన ధృవను ఎట్టిపరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ చేసే ఆలోచన లేదని.. ముందుగా నిర్ణయించిన ప్రకారమే డిసెంబర్ 2న థియేటర్లలోకి వచ్చేయడం ఖాయమని తెలుస్తోంది.

ఇక ధృవకు ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోగా.. రేపే ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. సినిమాలు కేవలం 4 పాటలు మాత్రమే ఉన్నట్లు ఇప్పటికే తెలిసిపోగా.. రీసెంట్ గా టైటిల్ సాంగ్ పిక్చరైజేషన్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. కేవలం పోస్ట్ ప్రొఢక్షన్ పనులు తప్ప వేరే ఏమీ పెండింగ్ లేకపోవడంతో.. ధృవ రిలీజ్ ఖాయమే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో ఈ నెల 20న గ్రాండ్ గా జరపనున్నారు. బైలింగ్వల్ తో అయినా హిట్ పడుతుందా..

,  ,  ,  ,  ,  ,