Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Sep-2017 13:41:58
facebook Twitter Googleplus
Photo

గత కొన్నేళ్లలో ఏడో వారంలోనూ థియేటర్లు నిండిపోవడం అనేది బాహుబలి: ది కంక్లూజన్ కే జరిగిందని.. ఆ తర్వాత ఇలాంటి ఫీట్ సాధించిన సినిమా తమ ఫిదానే అని దిల్ రాజు అన్నాడు. ఒక్కొక్కరు రెండు మూడుసార్లు థియేటరు కెళ్లి ఫిదా చూశారని.. చిన్న సినిమాగా రిలీజై ఫిదా కు ఇలాంటి ఆదరణ దక్కడం అపురూపమైన విషయమని రాజు అన్నాడు.

ఏదైనా గట్టిగా అనుకుంటే తప్పకుండా జరుగుతుందని అంటుంటారని.. సినిమాలో కూడా అదే చెప్పామని.. ‘ఫిదా’ గురించి కూడా తాము గట్టిగా అనుకోవడంతో ఇంత పెద్ద హిట్టయిందని ఈ సినిమా అర్ధశత దినోత్సవంలో దిల్ రాజు చెప్పాడు. వరుణ్ తేజ్ తన కొత్త సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లబోతున్నాడని.. అందుకే ఇంకో నాలుగు రోజుల తర్వాత ఫిదా 50 రోజులు పూర్తి చేసుకుంటున్నప్పటికీ ముందుగానే అర్ధశత దినోత్సవం నిర్వహిస్తున్నామని దిల్ రాజు చెప్పాడు.

50.. 100 రోజుల వేడుకల్ని ఈ రోజుల్లో ఎవరూ నిర్వహించడం లేదని.. మూడు వారాల్లోనే థియేటర్ల నుంచి సినిమాను తీసేస్తున్నారని.. కానీ ఫిదా మాత్రం దీనికి భిన్నంగా ఏడో వారంలోనూ అదరగొడుతోందని వరుణ్ అన్నాడు. తన కెరీర్లో హ్యాపీ డేస్ తర్వాత మళ్లీ అంతటి విజయం ఫిదా నే సాధించిందని.. ఈ సినిమా జర్నీనే ఒక మ్యాజిక్ అని.. ఆ మ్యాజిక్ ను మళ్లీ మళ్లీ రిపీట్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని శేఖర్ కమ్ముల చెప్పాడు.

,  ,  ,  ,  ,