Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2015 14:16:12
facebook Twitter Googleplus
Photo

ఆడపిల్లలను అపురూపంగా చూసుకునే ఓ మధ్య తరగతి తండ్రి, డబ్బు - అధికారం గల పెద్దవాళ్లతో తలపడవలసి వచ్చినప్పుడు .. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతగా తాపత్రయ పడతాదనేది అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం 'దృశ్యం'. ఇప్పుడు ఈ కథ .. 'పాపనాశనం' పేరుతో తమిళ ప్రేక్షకుల ముందుకి రానుంది. కమల్ .. గౌతమి ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను, జూలై 3 న అక్కడ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ కథను మలయాళ తెరపై ఆవిష్కరించిన 'జీతూ జోసెఫ్' ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ వుండటం విశేషం. ముందుగా మలయాళంలోను .. ఆ తరువాత తెలుగులోను 'దృశ్యం' పేరుతో విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. కథావస్తువు నేటి సమాజంలోని సంఘటనలను గుర్తుకుచేస్తూ వాస్తవానికి దగ్గరగా వుండటం వలన, ఈ సినిమా మలయాళ .. తెలుగు భాషల్లో ఆదరణ పొందిందని కమల్ చెబుతున్నాడు. అదే కథాబలం కారణంగా తమిళ్లోను ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు.

,  ,