Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2015 13:29:53
facebook Twitter Googleplus
Photo

మిర్చి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. ఇప్పుడు శ్రీమంతుడిగా మారిపోయాడు. తన మొదటి సినిమాని మించిన హిట్ సాధించడం ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ కి మెమరబుల్ సక్సెస్ ఇవ్వడం బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో.. ఇప్పుడు కొరటాల మోస్డ్ డిమాండ్ ఉన్న డైరెక్టర్ అయిపోయాడు.

మహేష్ కి అతి దగ్గరైన డైరెక్టర్ ఇప్పటివరకూ త్రివిక్రమ్ ఒక్కడే. గతంలో గుణశేఖర్ తో మంచి బాండింగ్ ఉండేది సూపర్ స్టార్ కి. ఏ డైరెక్టర్ తోనూ చేయనన్ని మూవీస్ గుణతో చేశాడు వరుసగా. ఫ్లాపుల కారణంగా తర్వాత కాలంలో ఈ లింక్ డిస్ట్రబ్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ బాబు ఫేవరేట్ డైరెక్టర్ల లిస్ట్ లో కొరటాల కూడా జాయిన్ అయిపోయాడు.

కొరటాలకు ఆడి కారుతో సర్ ప్రైజ్ ఇచ్చిన మహేష్.. తన మూవీస్ కి సంబంధించిన అంశాలపై డిస్కషన్ కూడా చేస్తున్నాడట. తను కూడా ఊహించని స్థాయిలో 100 కోట్ల హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి.. తగిన విలువే ఇస్తున్నాడని టాలీవుడ్ లో అనుకుంటున్నారు. అంతే కాదు.. నెక్ట్స్ మళ్లీ ఓ ప్రాజెక్ట్ చేద్దాం.. స్టోరీ స్క్రిప్ట్ రెడీ చేసుకోమని కొరటాలకి చెప్పాడట సూపర్ స్టార్. ఈ సారి వీరిద్దరి టార్గెట్ శ్రీమంతుడిని మించిన హిట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

,  ,  ,