Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2016 11:09:17
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న జనతా గ్యారేజ్ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదే రోజునే నాగచైతన్య ప్రేమమ్ ని కూడా విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. దీంతో తారక్ - చైతూల మధ్య వార్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరంగా చర్చించుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ వార్ డౌటే అని తెలుస్తోంది. అందుకు కారణం దిల్ రాజు. అసలు దిల్ రాజుకీ - ఎన్టీఆర్... నాగచైతన్యల సినిమాలకీ మధ్య సంబంధమేమిటంటారా? ఆ రెండు సినిమాలకి సంబంధించిన నైజామ్ రైట్స్ ని దిల్ రాజే సొంతం చేసుకొన్నాడు.

మరి ఒకేసారి రెండు పెద్ద సినిమాల్ని విడుదల చేస్తే థియేటర్లు కేటాయించడం కష్టమవుతుంది. సో... దిల్ రాజు కోసమైనా ఆ సినిమాలు అటూ ఇటూగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయన్నది ట్రేడ్ వర్గాల టాక్. అందులోనూ నిజం లేకపోలేదు మరి! రెండు పెద్ద సినిమాలకి ఒకేసారి అది కూడా ఒకే డిస్ట్రిబ్యూటర్ థియేటర్లు కేటాయించడం కష్టమైన పనే. అందుకే ఏదో ఒక సినిమా వెనక్కి ముందుకు జరగక తప్పని పరిస్థితి. అయితే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మాత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని ఆ చిత్ర నిర్మాతలు మరోసారి ఖరారు చేశారు. అంటే చైతూ సినిమా విడుదల తేదీలోనే మార్పుంటుందన్నమాట.

,  ,  ,  ,  ,