Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Oct-2017 17:01:23
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మ తన ప్రతి ఆలోచనా ఒక సంచలనంగా మారాలని అనుకుంటాడు. ఏ మాత్రం తడబడకుండా తన మనసులో ఉన్న ఆలోచనను అద్దంపట్టినట్లు చూపిస్తాడు. కానీ అప్పుడే అర్ధం కాకుండా అద్దాన్ని పగుల గొట్టేస్తాడు. అంటే అర్ధమయ్యే లోపే అర్ధం కాకుండా వ్యవహరిస్తారు సారు వారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి వివరించాడు.

ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను మొదటి అవకాశం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఎలాగైనా రామోజీ రావు గారిని కలిసి ఆయనతో ఒక సినిమాను చెయ్యాలని అనుకున్నాను. ఎలాగైనా ఆయనను కలవాలని ఒక ఆర్టికల్ రాసి అయన వారికి పంపాను. ఆలోచనలు ఒక 50 మిలియన్ పీపుల్స్ ని చంపాయి అనే ఆర్టికల్ వారి న్యూస్ టైమ్ పేపెర్ కోసం రాసాను. అది రామోజీరావుగారికి నచ్చింది. అప్పుడు అయన నుంచి అఫర్ వచ్చింది. పిలిచి మాట్లాడారు. ఆర్టికల్ చాలా బావుందని చెప్పారు. కానీ నేను ఆయనకు కథను చెప్పి సినిమాను తియ్యాలని అనుకున్నాను. కానీ రామోజి రావు ఎటువంటి అనుభవము లేని నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ ఉద్యోగం ఇస్తానని చెప్పారని రామ్ గోపాల్ వర్మ వివరించారు.

అయితే ఆ తర్వాత ఒకరోజు ఆ ఆర్టికల్ ఆ పేపర్ లో ప్రచురించబడిందని నా ఫ్రెండ్స్ - ఫ్యామిలీ మెంబర్స్ పేపర్లో నా పేరొచ్చిందని ఆశ్చర్యపోయారని వర్మ వివరించాడు. ఆ ఆర్టికల్ వలన పెద్దగా ఒరిగేందేం లేకపోయినా కూడా తనకు మాత్రం పేరొచ్చేసిందని వివరించాడు వర్మ.

,  ,  ,  ,