Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2017 14:09:43
facebook Twitter Googleplus
Photo

మల్టి స్టారర్ సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యిందనే చెప్పాలి. అయితే అంతకంటే కిక్ ఇచ్చే మ్యాజిక్ మల్టి స్టారర్ లు మన దర్శకులు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఒక స్టార్ హీరో పక్కన మరి మినీ స్టార్ హీరోనే పెట్టుకుంటున్నారు. మినీ హీరోలకు భారీగా మార్కెట్ లేకున్నా క్రేజ్ మాత్రం బాగానే ఉంటోంది. దీంతో పెద్ద హీరోల సినిమాలకు వారిని జత చేస్తే ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా చూసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

అయితే గత కొంత కాలంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాలో అల్లరి నరేష్ ఒక క్యారెక్టర్ చేయబోతున్నాడు అనే టాక్ బాగా వినిపించింది. ఆ విషయం ప్రస్తావనకు వచ్చినపుడు కూడా నరేష్ నో అని అయితే నోరువిప్పలేదు. ఇంకా ప్రాసెస్ జరుగుతోంది అని ఒక హింట్ మాత్రం ఇచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమాను దిల్ రాజు - అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుత సినిమా గురించి మరొక కొత్త టాపిక్ కూడా బాగా వినిపిస్తోంది. అదేమిటంటే.. నిర్మాత దిల్ రాజు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని సినిమాలో ఉన్న ఒక కీ రోల్ చేయించాలని పట్టుబట్టాడట. మరి అల్లరి నరేష్ కి సెట్ చేసిన పాత్రకు అనుకుంటున్నారా లేక మరొక క్యారెక్టర్ కి మెగా హీరోని అనుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఓక క్లారిటీ రావాలంటే దిల్ రాజు తప్పకుండా స్పందించి తీరాల్సిందే.

,  ,  ,  ,