Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Sep-2016 15:19:06
facebook Twitter Googleplus
Photo

మజ్ఞూ అంటే ఏడుపు పెడబొబ్బుల సినిమాయేనా? మామూలుగా మనకు మజ్ఞూ అనే క్యారెక్టర్ అంటే ప్రేమలో విఫలం చెందిన ఒక దేవదాస్ అనే క్యారెక్టర్ మదికి తడుతుంది. ఆ లెక్కన చూస్తే హీరో నాని కొత్త సినిమాలో కూడా అదే కంటెంటా? ఈసారి రెండు వారాలపాటు ప్రమోషన్లు దంచేసి సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయిపోయాడు న్యాచురల్. అసలింతకీ ఈ సినిమాలో కంటెంట ఎలా ఉండబోతోంది అని అడిగితే.. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.

''సినిమాలో వన్ ఆర్ టు మినిట్స్ బాధపెడతామేమో కాని.. సినిమా అంతా మొత్తంగా నవ్విస్తూనే ఉంటా.. ప్రతీ సీన్లోనూ జోకులే జోకులు. మాటల నుండి యాక్షన్ల వరకు అన్నీ మిమ్మల్ని నవ్విస్తాయి. నా మనస్సుకు బాగా నచ్చిన సినిమా ఇది'' అంటూ చెబుతున్నాడు నాని. మరి ఇళయరాజా శ్యాడ్ సాంగ్స్ సిడి ఒకటి ఇవ్వమ్మా అంటూ మ్యూజిక్ స్టోర్లో అడుగుతున్నట్లు ప్రోమో ఒకటి కట్ చేశావేంటి నాని అంటే.. ''నేను అలా శ్యాడ్ సాంగ్స్ సిడి అనగానే మీరందరూ నవ్వేశారుగా. అలా నేను ఏడ్చి అయినా కూడా మిమ్మల్ని నవ్వించడమే నాకు ఇష్టం. ఈ సినిమాలో అసలు ఏడుపు మూమెంట్స్ ఏమీ లేవు. మీరు వర్రీ అవ్వకండి'' అంటూ తన అభిమానులకు సెలవిస్తున్నాడు.

సెప్టెంబర్ 23న నాని ''మజ్ఞూ'' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్టు కొట్టేద్దాం అనే ఊపుమీదున్న నాని.. ఈ సినిమాతో కూడా అనూ ఎమ్మానుయేల్ అండ్ ప్రియశ్రీ లుదానీ అనే ఇద్దరు కొత్త భామలను పరిచయం చేస్తున్నాడు. అది సంగతి

,  ,  ,  ,  ,  ,