Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2016 12:16:50
facebook Twitter Googleplus
Photo

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే లెజెండ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. అక్కినేని నాగార్జునకు మాత్రం బిగ్ బీతోను.. ఆయన ఫ్యామిలీతోను మంచి అనుబంధం ఉంది. 23 ఏళ్ల క్రితమే అమితాబ్ తో కలిసి ఖుదా గవా చిత్రంలో నటించాడు నాగార్జున. రీసెంట్ గా మనం చిత్రంలో బిగ్ బీ కేమియో రోల్ చేయడం చూస్తే.. వీరి రిలేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది.

బాలీవుడ్ మెగాస్టార్ తో కలిసి మళ్లీ పని చేయడంపై మనసు పంచుకున్నాడు నాగ్. 'అమితాబ్ గారి యాక్టింగ్.. వాయిస్-డిక్షన్ పై బేస్ అయి ఉంటుంది. హిందీలోనే మాట్లాడే ఆయన.. అందుకే భాష రాకపోతే సినిమా చేయరు. నాకు ఆయన పెద్ద ఇన్ స్పిరేషన్. ఏ పాత్రను ఎలా కావాలంటే అలా మళ్లించి యాక్ట్ చేయడంలో ఆయన మాస్టర్. నాకు అమితాబ్ లా విభిన్నంగా చేయాలని ఉంది కానీ.. ఆయనలో ఓ పది శాతం చేసినా చాలు' అంటూ బిగ్ పై తన అభిమానాన్ని గౌరవాన్ని చాటాడు నాగార్జున.

ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మీలో ఎవరు కోటీశ్వరుడు పగ్గాలు అందించడం పై కూడా నాగ్ వివరించాడు. చైతు-అఖిల్ ల సినిమాల పనులు ఉండడం కారణంగానే తప్పుకుంటున్నానని చెప్పిన నాగ్.. చిరంజీవి హాట్ సీట్ లో ఉంటే.. తాను గెస్ట్ గా కనిపించే ఎపిసోడ్ ఉంటుందని చెప్పాడు.

,  ,  ,  ,  ,