Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 11:11:22
facebook Twitter Googleplus
Photo

పెళ్ళి చూపులు సినిమా ఏ రేంజులో వసూలు చేసిందో అందరికీ తెలుసు. ఒక చిన్న సినిమా ఆ రేంజులో సక్సెస్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనప్పటికీ.. రిలీజైన చాలా ధియేటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకోవడం ఈ సినిమా ప్రత్యేకత. అలాంటి మ్యాసివ్ హిట్ మరి ఇతర నిర్మాతలపై ఎటువంటి మాయాజాలం చూపించింది అంటే.. అందుకు మనం ఓసారి దిల్ రాజు గారి దగ్గరకు వెళ్ళాలి.

ఇలా నీ జతగా అంటూ నూతన దర్శకుడు యాకూబ్ ఆలి రూపొందించిన సినిమాను వెళ్ళిపోమాకే అంటూ టైటిల్ మార్చి రాజుగారు రిలీజ్ చేస్తున్నారని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నిజానికి రాజు గారు చాలా చాలా చిన్న సినిమాల తాలూకు డబుల్ పాజిటివ్ (ఫైనల్ కాపీ) చూస్తుంటారు కాని.. ఆయన అన్నింటినీ కొనేయరు. చాలా రేర్ గా దిల్ రాజు చిన్న సినిమాలపై కన్నేస్తారు. అయితే పెళ్ళి చూపులు సక్సెస్ చూసిన తరువాత.. ఏ మాత్రం బాగుంది అనిపించినా కూడా అటువంటి సినిమాలను కొనేయలని ఆయన ఫీలవుతున్నారట.

ఎందుకంటే పెళ్లి చూపులు సినిమాను 2 కోట్లకు దర్శకనిర్మాత మధుర శ్రీధర్.. మరియు బడా నిర్మాత సురేష్ బాబు కొనుక్కుంటే.. సినిమా కలక్షన్లు ఎలా వచ్చాయో మనకు తెలిసిందే. అందుకే దిల్ రాజు కూడా అదే ఎఫెక్టుతో చిన్న సినిమాలను అసలు వదిలిపెట్టట్లేదని తెలుస్తోంది. కాని సినిమా తీయక మునుపు ఇదే సినిమా కథలు ఆయనకు చెప్తే.. అబ్బే వర్కవుట్ కాదు అనేసిన సందర్భాలు అనేకం. ప్చ్!!

,  ,  ,  ,