Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2016 13:44:52
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నాగశౌర్యకు జంటగా మెగా డాటర్ నీహారిక అరంగేట్ర మూవీ 'ఒక మనసు'. ఈ మూవీ ఆడియో వేడుక.. మెగా హీరోల మధ్య అద్భుతంగా జరిగింది. దర్శకుడు రామరాజు.. ఈ చిత్రం తన ఒక్కడి కష్టం కాదని.. నాగశౌర్య - నీహారిక - ఎక్కడో ఏ మూలో నేను కూడా.. కలిసి తయారు చేసుకున్న ప్రొడక్ట్ అని చెప్పాడు.

'నేను శౌర్య - నీహారికలను ఎప్పటికీ సూర్య - సంధ్యలుగానే వాళ్లను పిలుస్తాను. వాళ్ల గురించి చెప్పడానికి నాకు మాటలు రావడంలేదు. నిజానికి ఫేస్ ఆఫ్ ది ఫిలిం ఆల్వేస్ యాక్టర్స్ అనే మాటను నేను నమ్ముతాను. నాగబాబు గారూ.. మీ అమ్మాయిని నా చేతుల్లో పెట్టినందుకు థాంక్యూ సోమచ్' అన్న రామరాజు... 'అదృష్టం అమ్మాయి రూపంలో పుడితే అది నీహారిక' అని చెప్పడం మెగా ఫ్యాన్స్ ని ఖుషీ చేసేసింది.

'మీ అందరి లాగా నేనూ చిరంజీవి గారికి అభిమానినే. నీహాను నేను అంతే గౌరవంతో చూపించాను. లక్షలాది మంది అభిమానులకు ఇప్పుడు ఓ అమ్మాయి తోడవుతోంది. తను ఎప్పటికీ మీ ఇంటి ఆడపడుచుగా మిగిలిపోతుంది. అంత గొప్ప నటి అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే. నీహారిక మనకు మరో సావిత్రిగా మిగులలన్నది నా కోరిక' అని దర్శకుడు రామరాజు చెప్పడంతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.

,  ,  ,  ,  ,  ,