Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2016 15:29:41
facebook Twitter Googleplus
Photo

"పుస్తకం లో కొన్ని పేజీలు " చిత్రంతో దరకుడిగా మారిన యువ ప్రతిభాశాలి సాజిద్ ఖురేషి.. ఆ మధ్య వచ్చి చెప్పుకోదగ్గ విజయం సాధించిన "చంద్రిక" చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఆయన దర్సకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం "బుల్లెట్ రాణి" . నిషా కొఠారి టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నదలోనూ ఏక కాలంలో రూపొందడం విశేషం. ఫోకస్ ఆన్ పిక్చర్స్ పతాకంపై ఎం. ఎస్. యూసఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, షఫీ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
కన్నడలో మార్చ్ 10న, తెలుగులో మార్చ్ 11న విడుదలవుతున్న "బుల్లెట్ రాణి" గురించి చిత్ర దర్శకులు సాజిద్ ఖురేషి మాట్లాడుతూ.. "యాక్షన్ తో పాటు కామెడీకి ఇంపార్టెన్స్ ఇస్తూ రూపొందిన "బుల్లెట్ రాణి"లో సెంటిమెంట్ కి కూడా ప్రాధాన్యముంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నిషా కొఠారి పెర్ఫార్మెన్స్. సంఘ విద్రోహ శక్తులపై విరుచుకుపడే డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా నిషా నటన అందర్నీ అమితంగా ఆకట్టుకుంటుంది. అలాగే.. ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, షఫీ తదితరులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. అదేవిధంగా గున్వంత్ సంగీతం, సెల్వం సినిమాటోగ్రఫి, సురేష్ కుమార్ ఎడిటింగ్ "బుల్లెట్ రాణి" చిత్రం సాధించబోయే విజయంలో సముచిత పాత్ర పోషించనున్నాయి. దర్శకుడిగా ఈ చిత్రం నాకు మరింత మంచి గుర్తింపు తీసుకు వస్తుందనే నమ్మకం ఉంది. ఈ సందర్భంగా మా నిర్మాత యూసఫ్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అన్నారు!!

,  ,  ,  ,  ,