Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Feb-2017 11:45:18
facebook Twitter Googleplus
Photo

తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తుంటాడు దర్శకుడు తేజ. ఇప్పుడు రేస్ లో వెనకబడ్డాడు కానీ.. గతంలో సెన్సేషన్స్ సృష్టించిన ఈ డైరెక్టర్.. రానా నటించిన మూవీ ఘాజీని తెగ పొగిడేస్తున్నాడు. గతంలో బాహుబలి లాంటి మూవీపై కూడా విమర్శలు చేసిన హిస్టరీ ఉంది. బాహుబలి బాగుంది అని చెప్పినవాడు.. ఇండస్ట్రీలో ఒక్కడు కనిపించలేదు అన్నది తేజ చెప్పిన మాట.

అలాంటిది మరిప్పుడు రానాను.. ఘాజీగా తెగ పొగిడేయడం.. తనే అడిగి మరీ ఓ టీవీ ఛానల్ కి రానాని ఇంటర్వ్యూ చేయడం.. ఇలా చాలా హంగామానే చేశాడు తేజ. అవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక ఘాజీ విషయంలో ఈ దర్శకుడు ఇంతగా స్పందించేయడానికి కారణం.. ఘాజీ నిజంగా అంత నచ్చేసిందా అనుకుంటున్నారు. దీంతోపాటు మరో కారణం కూడా చెప్పుకోవాలి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న తేజ సినిమా 'నేనే రాజు.. నేనే మంత్రి లో రానానే హీరో. కాజల్ అగర్వాల్ హీరోయిన్. బాహుబలి2లో విలన్ కాబట్టి.. రానా హీరోగా విడుదలయ్యే నెక్ట్స్ మూవీ కూడా ఇదే.

అందుకే తన సినిమాని మార్కెట్ చేసుకునేందుకు.. ముందొచ్చిన ఘాజీని తెగ మురిపించేస్తున్నాడని అంటున్నారు సినీ జనాలు. ఈ మూవీ రేంజ్ ఎంత పెరిగితే.. తాను తీస్తున్న నేనే రాజు నేనే మంత్రి ని అంత సులువుగాను.. ఎక్కువగానూ మార్కెట్ చేసుకోవచ్చనే యాంగిల్ గట్టిగానే వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,