Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 15:22:43
facebook Twitter Googleplus
Photo

స్టార్ వాల్యూ లేని సినిమా మీద నైజాం ఏరియాలో రూ.8 కోట్ల పెట్టుబడి పెట్టడం పెద్ద సాహసమే అని చెప్పాలి. కానీ దిల్ రాజు మాత్రం స్ట్రాటజిగ్గా ?అఆ? సినిమాను రూ.8.3 కోట్లకు కొనేశాడు. ఐతే అతడి అంచనా ఎంత కరెక్టో ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు రిలీజైన ఈ సినిమా నైజాంలో అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తోంది. కేవలం తొలి రోజు మాత్రమే రూ.3.1 కోట్ల గ్రాస్.. రూ.2.3 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం.

తెలంగాణలో మెజారిటీ థియేటర్లు దిల్ రాజు అధీనంలో ఉండటంతో ?అఆ? స్టార్ హీరోల సినిమాల స్థాయిలోనే భారీగా రిలీజ్ చేసుకున్నాడు రాజు. దీనికి మంచి ఫలితమే దక్కింది. త్రివిక్రమ్ మ్యాజిక్ కు నితిన్ ఫాలోయింగ్ కూడా తోడై తెలంగాణలో ?అఆ? బ్లాక్ బస్టర్ రేంజికి చేరేలా కనిపిస్తోంది. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా యాడ్ కావడంతో ఆదివారం అయ్యేసరికే రూ.6-7 కోట్ల మధ్య షేర్ వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు. తొలి వారం పూర్తయ్యేసరికి రాజు లాభాల్లో ఉంటాడు.

మరోవైపు అమెరికా బయ్యర్ రాజు కంటే సంతోషంగా ఉన్నాడు. వీకెండ్ అయ్యేసరికే బయ్యర్ లాభాల్లోకి వచ్చేస్తున్నాడు. ఈ సినిమాకు రూ.4.5 కోట్లు పెట్టుబడిగా పెట్టగా.. శనివారం అయ్యేసరికే మిలియన్ వసూళ్లు మార్కును అందుకుంటోంది ?అఆ?. ఆదివారం కూడా భారీగా కలెక్షన్లు ఉండే అవకాశముంది. పెట్టుబడి అంతే నాలుగు రోజులకే వెనక్కి వచ్చేసేలా ఉంది. తొలి వారం అయ్యేసరికే 1.5 మిలియన్ మార్కును టచ్ చేసేలా ఉంది అఆ. మొత్తానికి సమ్మర్లో ఇంతకుముందు వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం తీవ్ర నిరాశ మిగిల్చినా.. ?అఆ? లాంటి మీడియం సినిమా అందరికీ సంతోషాన్నిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,