Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2017 12:38:40
facebook Twitter Googleplus
Photo

ఓ కథ రాసి దాన్ని సినిమాగా తీయాలని అనుకున్నపుడు అది అతడికి గొప్పగా అనిపిస్తోంది. సినిమా తీస్తున్నపుడు.. పూర్తి చేశాక ఔట్ పుట్ విషయంలో ఎలాంటి ఫీలింగ్ ఉన్నప్పటికీ బయటికి మాత్రం గొప్పగానే చెప్పుకుంటారు. సినిమా విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకున్నపుడు కూడా తమ సినిమా బాగాలేదని ఒప్పుకోరు. కానీ కొన్ని నెలలు గడిచాక మాత్రం వాస్తవం బోధపడుతుంది. అప్పుడు తమ తప్పిదాల్ని అంగీకరిస్తారు. సీనియర్ డైరెక్టర్ తేజ కూడా ఇప్పుడదే చేశాడు. గత దశాబ్దంన్నర కాలంలో తేజ చాలా సినిమాలు తీశాడు. అవన్నీ నిరాశ పరిచాయి. కానీ ఆ సినిమాల గురించి విడుదలకు ముందు గొప్పగా చెప్పాడు తేజ. కానీ ఇప్పుడు మాత్రం తన కథల్లో లోపాలుండటం వల్లే అవి ఫ్లాపయ్యాయని తేల్చాడు.

నిజాయితీగా చెప్పాలంటే తాను తీసిన ప్రతి ఫ్లాప్ సినిమా ఫలితం గురించి తనకు ముందే తెలుసని తేజ చెప్పడం విశేషం. కొన్ని సినిమాల ఫలితాలు ఆడవని ముందే అర్థమైందని.. కానీ సినిమా హిట్టవుతుందనే ఆశ వాస్తవాన్ని కమ్మేసిందని తేజ చెప్పాడు. కథల్లో లోపాలుండటం వల్లే తన సినిమాలు ఆడలేదన్నది వాస్తవమని తేజ చెప్పాడు. ఐతే తన సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన తాను అప్ డేట్ కాలేదని.. అందుకే అలాంటి ఫలితాలు వచ్చాయని అంటే మాత్రం తాను అంగీకరించనని తేజ తేల్చి చెప్పాడు. తన సినిమాల ఫలితాలు తనను ఎంతమాత్రం మార్చలేదని.. తాను విజయాల్లో ఉన్నపుడు.. ఫ్లాపులు ఎదురైనపుడు.. ఎప్పుడూ ఒకేరకంగా ఉన్నానని తేజ చెప్పాడు.

,  ,  ,  ,  ,