Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2017 11:20:30
facebook Twitter Googleplus
Photo

డిఫరెంట్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించి మంచి దర్శకుడిగా పెరు తెచ్చుకున్నడు సుకుమార్. ప్రేమ కథలతో మ్యాజిక్ చేసే సుకుమార్ ఈ సారి కొత్త తరహాలో రాబోతున్నాడు. రామ్ చరణ్ - సమంత మెయిన్ లీడ్ లో వస్తున్న రంగస్థలం-1985 సినిమా కోసం సుకుమార్ ప్రస్తుతం చాలా కష్టపడుతున్నాడు. అలాగే చరణ్ అండ్ సామ్ ని కూడా చాలా కష్టపెడుతున్నాడట సుకుమార్.

ఎప్పుడు బ్రాండెడ్ దుస్తులతో సెల్ ఫోన్ లతో కాలాన్ని గడిపే వారిని ఏకంగా 1985 కాలంలోకి తీసుకెళ్లి ప్రేమ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నాడట. ప్రస్తుత రోజుల్లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం అవుతున్న ఇంటర్ నెట్ లేని కాలంలో ఓ అమాయకుడు ప్రేమను ఎలా సంపాదించుకున్నాడు అలాగే సమంత ని ప్రేమలోకి ఎలా దించాడు అనే కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో వేసిన సెట్స్ లలో చిత్ర యూనిట్ బిజీగా వుంది. ఇక సమంత - రామ్ చరణ్ కూడా సెల్ ఫోన్ నే మరచిపోయారంట. ఆ కాలానికి సరిపోయేటట్లు ఉండేలాగా రామ్ చరణ్ లుక్ కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేస్తున్నారట. అక్కడే ఓ చిన్నసైజు వస్త్ర దుకాణంలోనే రామ్ చరణ్ కు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ తయారవుతున్నాయన్న సంగతి తెలిసిందే.

ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో మునిగి తేలే సమంత షూటింగ్ లో ఉంటే సెల్ ఫోన్ విషయాన్నే మర్చిపోయిందట. క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు తెరకెక్కిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,