Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2015 15:23:16
facebook Twitter Googleplus
Photo

సినిమాలో రెయిన్ ఎఫెక్ట్ తేవాలంటే ఏం చేస్తారు? ట్యాంకర్లు ఫైరింజన్ లు రంగంలోకి దిగాల్సిందే. వాటిని ఆపరేట్ చేసేందుకు ఓ 10 నుంచి 15మంది తెగ హడావుడి చేసేస్తుంటారు. అయితే ఇదంతా బోలెడంత ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్. అనవసరంగా నీళ్లు వృథా. పైగా నేచురల్ రెయిన్ ఎఫెక్టు కనిపించదు. పైగా పనోళ్లకు బోలెడంత డబ్బులు చెల్లించుకోవాలి. ఎందుకీ యాతన? ఒక రియల్ క్రియేటర్ ఎప్పుడూ ఇలాంటి వృథాని ఎలా అరికట్టాలా? అనే ఆలోచిస్తారు.

డైరెక్టర్ తేజ స్టయిల్ కూడా అదే. పరిమిత బడ్జెట్ లో సినిమా తీయడంలో తేజ ఎక్స్ పర్ట్. అందుకే అతడు తెరకెక్కించిన తాజా చిత్రం హోరా హోరీ కోసం పై హడావుడి ఏదీ లేకుండా ఓ కొత్త యంత్రాన్ని కనిపెట్టాడు. కేవలం 12 లక్షల ఖర్చుతో రెయిన్ మెషీన్ ని తయారు చేయించాడు. దీన్ని ఆపరేట్ చేయడం చాలా సింపుల్. ఇద్దరు ఉంటే చాలు. అలాగే రోజంతా వాటర్ ని స్ప్రింగ్ చేస్తే నాలుగైదు ట్యాంకర్ల నీళ్లు కావాలి. కానీ ఈ మెషీన్ వాడితే కేవలం అరట్యాంకర్ నీళ్లు సరిపోతాయి. దానివల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది. పైగా నేచురల్ గా వాన కురుస్తున్నట్టే ఉంటుందీ ఈ యంత్రంతో కురిపిస్తే. వాన ఎట్నుంచి పడాలి? ఎవరి మీద పడాలి? అన్నది తెలిస్తే పని చాలా సులువు.. ఈ సంగతులన్నీ తేజ స్వయంగా చెప్పారు. హోరా హోరీ పూర్తిగా రెయిన్ ఎఫెక్టుతో తీస్తున్న సినిమా కాబట్టే ఈ ప్రయత్నం.

రెయిన్ మెషీన్ పనిచేసే తీరిది: మెషీన్ కి ట్యాంకర్ నుంచి వచ్చే గొట్టాంని అమరుస్తారు. దానిలోంచి మెషీన్ లోకి వెళ్లే నీరు తుంపర్లుగా మారి దాదాపు 20 మీటర్ల వరకూ చిమ్ముతుంది. నాజిల్స్ ద్వారా నీరు బయటకు స్ప్రే అవుతుంది కాబట్టి రెయిన్ ఎఫెక్ట్ సహజంగా కనిపిస్తుంది. రెయిన్ మెషీన్ తో పాటు హెడ్డర్లు వాడారు. ఇవి చూడ్డానికి పైపుల్లా ఉంటాయి. పైప్ చివరన ఉన్న బుష్ లు నీటిని ఆపి అక్కడి నుంచి బైటికి వెదజల్లుతాయి. ఈ యంత్రంతో పాటు ఓ ట్యాంకర్ ఆన్ సెట్స్ ఉండాలంతే.

,  ,  ,