Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 11:09:13
facebook Twitter Googleplus
Photo

రాజశేఖర్-జీవితల పెద్ద కూతురు శివాని సినీ అరంగేట్రంపై కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఇప్పటికే చెప్పేశారు. ఇప్పటికే ఓ కుర్ర హీరోతో మూవీకి సైన్ చేసిందని కూడా అన్నారు కానీ.. జీవిత మాత్రం వీటిని ఖండించింది. తామింకా స్క్రిప్ట్స్ వినే స్టేజ్ లోనే ఉన్నామని.. ఏదీ ఫైనల్ కాలేదని చెప్పేసిందామె.

ఇప్పుడు శివానిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోయే డైరెక్టర్ అంటూ.. ఓ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన వేరెవరో కాదు.. దర్శకుడు తేజ. ప్రస్తుతం రానా దగ్గుబాటి.. కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాన్ని తీస్తున్న తేజ.. ఆ వెంటనే శివానిని పరిచయం చేసే ప్రాజెక్టును ప్రారంభిస్తాడని అంటున్నారు. గతంలో రాజశేఖర్-తేజల కాంబినేషన్ లో 'అహం'అనే ప్రాజెక్టు తెరకెక్కుతుందని అన్నారు. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు కానీ.. కూతురుతో సినిమా చేసేందుకు దర్శకుడు ఓకే చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం.

జీవిత.. తేజ.. వీరిద్దరు క్లాస్ మేట్స్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అందుకే ఈ దర్శకుడి చేతిలో తమ కూతురు భవిష్యత్ పెట్టేందుకు సిద్ధమయ్యారట రాజశేఖర్ దంపతులు.

,  ,  ,  ,  ,