Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 14:54:36
facebook Twitter Googleplus
Photo


వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న సాయి పల్లవి యాక్టరే కాదు, డాక్టర్ కూడా. జార్జియాలో ఎంబిబిఎస్ చదివింది. గత నెలలో డాక్టర్ పట్టా అందుకుంది. అయితే తానింకా డాక్టర్ కాలేదు అంటోంది. ?జార్జియాలో ఎంబిబిఎస్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినప్పటికీ.. ఇండియాలో మరో ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ పాస్ అవ్వాలి. అప్పుడే డాక్టర్ అని చెప్పుకోగలను. చాలా ప్రెజర్ ఉంది? అని చెప్పింది. ఇండియాలో రూల్స్ ప్రకారం ఇతర దేశాల్లో డాక్టర్ చదివినవాళ్లు ఇక్కడ మెడికల్ అసోసియేషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్ రాయాలి.
మలయాళ సినిమా ?ప్రేమమ్?తో సాయి పల్లవి బాగా పాపులర్ అయ్యింది. మలర్ పాత్రలో మేకప్ లేకుండా సహజంగా నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకుంది. వరుణ్ తేజ్ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది. అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది. జూలై 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది

,  ,  ,  ,  ,