Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Feb-2017 16:23:27
facebook Twitter Googleplus
Photo

స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం దువ్వడా జగన్నాథం టీజర్ శివరాత్రి సందర్బంగా ఈరోజు ఉదయం విడుదలైంది. దీంతో రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి ఆతురతగా ఎదురుచూస్తున్న అభిమానులు టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సందడి మొదలుపెట్టారు. బన్నీకున్న స్టార్ డమ్, సినిమాపై ఉన్న అంచనాల వలన యూట్యూబ్ లో టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ ను తక్కువ సమయంలో అందుకుంటోంది.
ఉదయం తొమ్మిది గంటల సమయంలో రిలీజైన ఈ టీజర్ 5గంటల లోపే మిలియన్ మార్కుని అందుకుని రెండు మిలియన్ల దిశగా దూసుకుపోతోంది. బ్రాహ్మణ వంటవాడిగా బన్నీ లుక్ కొత్తగా ఉండటం, టీజర్లోనే రొమాన్స్, ఎమోషన్, భావోద్వగం వంటి అంశాలను చూపి సినిమా ఎంత వైవిధ్యంగా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు.

,  ,  ,  ,  ,