Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2015 16:19:48
facebook Twitter Googleplus
Photo

జీవితంలో కలలు కనడం ... అలాగే ఆ కలలు నిజమైనప్పుడు కలిగే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావడం సహజంగా జరుగుతూ వుంటుంది. అయితే తాను అసలు హీరోయిన్ ని అవుతాననీ, తన అభిమాన కథానాయికలను చూసిన వెండితెరపైనే తాను కూడా కనిపిస్తానని కల కూడా కనలేదని చెబుతోంది అసిన్. 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి' .. 'శివమణి' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఆమె చూరగొంది.

ఇక వరుసగా తమిళ చిత్రాల చేస్తూ అగ్రకథానాయికగా రాణించిన ఆమె, ఒక్కసారిగా తన మకాంని ముంబైకి మార్చేసింది. సాధారణంగా ముంబై నుంచి వచ్చి తెలుగు .. తమిళ చిత్రపరిశ్రమలో నిలబడిన కథానాయికల సంఖ్య ఎక్కువ. ఇక ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి అక్కడ పోటీని తట్టుకుని నిలబడినవాళ్లు చాలా తక్కువ. శ్రీదేవి .. జయప్రద లాంటివారికి అది సాధ్యమైంది. ఆ ఇద్దరూ తన అభిమాన కథానాయికలని ఒక సందర్భంలో అసిన్ చెప్పింది.

తాను ఒక కథానాయికని అవుతాననిగానీ, శ్రీదేవి .. జయప్రద తరువాత బాలీవుడ్లో తాను నిలదొక్కుకుంటానని గాని అసిన్ ఎప్పుడూ అనుకోలేదట. తనకి ఎంతమాత్రం పరిచయం లేని బాలీవుడ్ కి వెళ్లడం .. అక్కడ అగ్రకథానాయకులతో నటించే ఛాన్స్ లభించడానికి కారణం తన ప్రతిభేనని అంటోంది. కథానాయికగా తాను కెరియర్ ఆరంభించిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే, తన ప్రతిభకు అదృష్టం కూడా తోడైందని అనిపిస్తూ ఉంటుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

,  ,  ,