దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కుపై యంగ్ హీరో రామ్ మనసు పారేసుకున్నాడు. అందుకే, ఇప్పుడు తాను నటించే రెండు వరుస సినిమాలకు అతనినే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. గతంలో రామ్ నటించిన 'జగడం', 'రెడీ' సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ హీరో సినిమాలకు తమన్ ఎక్కువగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో చేంజ్ కోసం ఇప్పుడు మళ్లీ దేవీతో చేయిస్తున్నాడు. నూతన దర్శకులు శ్రీనివాసరెడ్డి, కిషోర్ తిరుమలతో రామ్ త్వరలో ఒక్కో సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటికీ కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. తన సినిమాలకు పెప్పీ, ట్రెండీ నంబర్స్ కావాలని రామ్ కోరుకుంటున్నాడట!
ram, dsp, newmovie, tollywood, news,