Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 16:28:43
facebook Twitter Googleplus
Photo

ఏమాయ చేసావె కాంబినేషన్లో మళ్లీ సినిమా అనగానే తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైపోయింది. ?సాహసం శ్వాసగా సాగిపో? మొదలై ఏడాదిన్నర అవుతోంది. ఆర్నెల్ల ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రచారం సాగింది. ఒకదాని తర్వాత టీజర్లు.. ఆడియో ట్రాకులు.. మ్యూజిక్ వీడియోలు.. రిలీజ్ చేస్తున్నారు కానీ.. సినిమా విడుదల సంగతేంటో మాత్రం చెప్పలేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించట్లేదు. దీంతో జనాలకు విసుగొచ్చేస్తోంది. ఇలా విసిగిపోయిన ఓ క్రిటిక్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్న కోన వెంకట్ ను రిలీజ్ డేట్ గురించి చెప్పమని అడిగితే.. ఆయన క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ నెల 26న ?సాహసం శ్వాసగా సాగిపో? చివరి సింగిల్ రిలీజవుతుందని.. ఆ సందర్భంగానే దర్శకుడు గౌతమ్ మీనన్ ఆడియోతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాడని.. ఇది పక్కా అని తెలిపాడు. కాబట్టి ఇంకో ఐదు రోజుల్లో చైతూ సినిమాపై క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ?ఏమాయ చేసావె?కు సీక్వెల్ కాని సీక్వెల్ గా తెరకెక్కింది ?సాహసం శ్వాసగా..? ఆ సినిమాలోని కార్తీక్ క్యారెక్టర్నే తీసుకుని.. యాక్షన్ బ్యాగ్రౌండ్లో ఈ సినిమాను తెరకెక్కించాడు గౌతమ్. మాంజిమా మోహన్ కథానాయికగా నటించింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. తమిళంలో ఈ చిత్రాన్ని శింబు హీరోగా తెరకెక్కించారు. తమిళ వెర్షన్ ఆలస్యం కావడం వల్లే తెలుగులో కూడా రిలీజ్ లేటవుతోంది.

,  ,  ,  ,  ,