Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 11:06:53
facebook Twitter Googleplus
Photo

మామూలుగా శుక్రవారం విడుదలయ్యే కొత్త సినిమాకు తొలి రోజు కలెక్షన్లు బాగుంటాయి. టాక్ ఎలా ఉన్నా రెండో రోజు కలెక్షన్లు కొంత మేరకు తగ్గుతాయి. ఐతే ఈ శుక్రవారం రిలీజైన ?ఎక్కడికి పోతావు చిన్నవాడా? విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు పెరగడం విశేషం. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ ఫస్ట్ డే కన్నా సెకండ్ డే కలెక్షన్లు ఎక్కువుండటం విశేషం. ఈ చిత్రానికి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.1.8 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఐతే రెండో రోజు రూ.2 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం.

నైజాం ఏరియాలో తొలి రోజు షేర్ రూ.43 లక్షలు కాగా.. రెండో రోజు ఏకంగా రూ.57 లక్షలకు పైగా షేర్ వసూలైంది. హిట్ టాక్ తెచ్చుకున్న పెద్ద సినిమాలకు సైతం ఇలా రెండో రోజు కలెక్షన్లు ఈ స్థాయిలో రైజ్ ఉండదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల తొలి రోజు ?ఎక్కడికి పోతావు చిన్నవాడా? మార్నింగ్... మ్యాట్నీ షోలకు అనుకున్న స్థాయిలో వసూళ్లు లేవు. ఐతే తొలి షో నుంచే టాక్ చాలా పాజిటివ్ గా ఉండటం.. సాయంత్రానికి టాక్ మరింత పాజిటివ్ గా మారడంతో జనాలు థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. తమ దగ్గరున్న వంద నోట్లను పొదుపుగా ఖర్చు పెడుతున్న జనాలు కూడా ఈ సినిమా చూడాల్సిందే అని ఫిక్సయ్యారు. సినిమా ఆ మేరకు వర్త్ ఫుల్ అని అందరూ అభిప్రాయపడ్డారు కూడా. దీంతో తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు బాగా పుంజుకున్నాయి. మొత్తంగా ఈ చిత్రం సూపర్ హిట్ రేంజిని అందుకునేలా కనిపిస్తోంది.

,  ,  ,  ,  ,