Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 15:06:48
facebook Twitter Googleplus
Photo

సినిమాల్లో పాత్రోచితమైన దుస్తులు వేసుకుంటూ ఉంటారు హీరోయిన్లు. కథలో డిమాండ్ చేసిన విధంగా వారి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. అయితే ప్రస్తుతం వస్తున్న సినిమాల్లోని హీరోయిన్లంతా ట్రెండీగానే కనిపిస్తుంటారు. యువతను ఆకర్షించేందుకు మోడరన్ కాస్ట్యూమ్స్ ఎక్కువగా ధరిస్తున్నారు. హీరోయిన్లు చీరకట్టుతో ఉండటం అనేది చాలా తక్కువగా కనిపిస్తోంది. అయితే సినిమాల్లో కనిపించినట్టుగానే నిజ జీవితంలో కూడా మోడ్రన్ డ్రెస్సులు వేసుకునే హీరోయిన్లే ఎక్కువ. బయట ఏవైనా పార్టీలైనా ఫంక్షన్లకు వచ్చినా మోడ్రన్ గెటప్స్ లో వచ్చేవాళ్లనే ఎక్కువగా చూస్తున్నాం. చక్కగా సంప్రదాయబద్ధంగా చీరకట్టుకుని కనిపించే హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు చెప్పండీ? అలాంటి కోవకే చెందుతుంది కీర్తీ సురేష్.

?నేను శైలజ? చిత్రంతో మన కుర్రాళ్లను బాగా ఎట్రాక్ట్ చేసింది కీర్తీ సురేష్. ఆ సినిమాలో పక్కా మోడరన్ డ్రెస్సులు వేసుకుని కనిపించింది. అయితే తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చీరకట్టుకే ప్రాధాన్యత ఇస్తుందట. ఇంట్లో ఉన్నప్పుడు సంప్రదాయ దుస్తులే వేసుకుంటుంది. ఈ మధ్యనే కీర్తీ సోదరి రేవతికి పెళ్లయింది. సిస్టర్ మేరేజ్ అంటే మాంచి డిజైనర్ దుస్తులు వేసుకుని అదరొట్టేయాలి కదా! కానీ కీర్తి మాత్రం చక్కగా చీరకట్టుతో సగటు తెలుగు అమ్మాయిలా కనిపించింది. చీరకట్టులో మోడరన్ లుక్ ఉంటుంది కదా! స్లీవ్ లెస్ బ్లౌజులు వేసుకునీ - ఫ్రీ హెయిర్ - మోడరన్ జువెలరీ వంటివి వేసుకునేవాళ్లూ ఉంటారు! కానీ కీర్తికి అవి కూడా పెద్దగా నచ్చవట. చక్కగా చీరకట్టుకుని జడ వేసుకుని - పూలు పెట్టుకుని - సంప్రదాయబద్ధంగా కనిపించడం ఇష్టమట. తన సిస్టర్ మ్యారేజ్ లో అలానే కనిపించింది అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించి.. తన సోదరి పెళ్లి ఫొటోల్లో కీర్తీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయిందన్నమాట!

,  ,  ,  ,  ,