Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Oct-2016 11:14:15
facebook Twitter Googleplus
Photo

వచ్చే ఏడాది మరోసారి బాహుబలి ఫీస్టుతో తెలుగు ప్రేక్షకలోకం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. ఇప్పటికే బాహుబలి 2.. క్లయమ్యాక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వార్ సీక్వెన్స్ మొత్తం తీసేశారట. గ్రాఫిక్స్ కారణంగా చాలా కష్టమైన సీక్వెన్స్ అయినప్పటికీ అవన్నీ చాకచక్యంగా రాజమౌళి ఫినిష్ చేశాడు. ఇక మిగిలింది కొన్ని సీన్లు మరియు రెండు పాటలే. ఇంతకీ వాటిలో ఒకటి తమన్నా తన పాలందాలను రాశులుపోసి ఆరబోసే పాటేనా??

బాహుబలి 1 లో తమన్నా చేసిన 'పచ్చ బొట్టేసిన' సాంగు రేంజు అంతా ఇంతా కాదు. ఈ పాట కోసం ఏకంగా బ్యాక్ లెస్ ఫోజులు కూడా ఇచ్చేసింది అమ్మడు. ఆ గ్లామర్ ను తట్టుకోలేని చాలామంది హీరోయిన్లు కుళ్లుకుంటే.. కొందరైతే ఏకంగా 'రేప్ ఆఫ్ అవంతిక' అంటూ పెద్ద పెద్ద లెక్చర్లే దంచేశారు. ఏదేమైనా కూడా ఆ గ్లామరానందం అభిమానులకు వీనుల విందులా కడుపు నింపేసింది. అయితే ఇలాంటి ఫీస్ట్ రెండో భాగంలో కూడా ఉందనుకుంటే మాత్రం కష్టమే. ఎందుకేంట ఈసారి అమ్మడు కేవలం సీన్లకు మాత్రమే పరిమితం కాబోతుంది.

''అవును.. బాహుబలి 2 తమన్నా పాత్ర నిడివి తక్కువే. మొత్తం అంతా అనుష్క చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తమన్నా సీన్లలో ఎంతవరకు అవసరమో అంతవరకే కనిపిస్తుంది. అసలు ప్రభాస్-తమన్నాపై ఒక్కటంటే ఒక్కపాట కూడా ఉండదు'' అంటూ సెలవిచ్చాడు రాజమౌళి. కావాలంటే యుట్యూబ్ లో పచ్చబొట్టేసినా సాంగును మళ్లీ చూసుకోవడమే కాని.. మరోసారి ఆ గ్లామరసం విరబూసే అవకాశం లేదన్నమాట.

,  ,  ,  ,  ,  ,