Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 12:14:47
facebook Twitter Googleplus
Photo

యుఎస్ లో మిలియన్ క్లబ్బును ఛేదించిన తొలి తెలుగు హీరో మహేష్ బాబే. ?దూకుడు? సినిమాతో తొలిసారి ఈ రికార్డును అందుకున్న మహేష్ అప్పట్నుంచి తన ప్రతి సినిమాకూ ఆ క్లబ్బులో అడుగుపెడుతూనే ఉన్నాడు. కొందరు హీరోలు హిట్టు సినిమాలతో కూడా మిలియన్ క్లబ్బును టచ్ చేయలేకపోతుంటే.. మహేష్ బాబు మాత్రం డిజాస్టర్లయిన ?1 నేనొక్కడినే? - ?ఆగడు? లాంటి సినిమాలతో సైతం ఈ మార్కును టచ్ చేయడం విశేషం.

ఇక మహేష్ సినిమా హిట్టయితే ఎలా ఉంటుందో ?శ్రీమంతుడు? రుజువు చేసింది. ఆ సినిమా రెండున్నర మిలియన్ల డాలర్ల దాకా వసూలు చేసి ఔరా అనిపించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్ లో సైతం నాన్-బాహుబలి రికార్డు మహేష్ పేరిటే ఉంది. మధ్యలో ?సర్దార్ గబ్బర్ సింగ్? సినిమా మహేష్ కు కొత్త టార్గెట్లు ఫిక్స్ చేస్తుందేమో అనుకున్నారు. ఐతే ఫస్ట్ డే కలెక్షన్లలో మినహాయిస్తే ఇంకే విషయంలోనూ ?సర్దార్? రికార్డు సాధించలేదు.

డొమెస్టిక్ వసూళ్ల మాటేంటో కానీ.. ఓవర్సీస్ లో మాత్రం మహేష్ కోసం కొత్త టార్గెట్ ఎదురు చూస్తోంది. ఈ సినిమాను అమ్మడమే అనూహ్యంగా రూ.13 కోట్లకు అమ్మారు. అంటే బయ్యర్ లాభాల బాట పట్టాలంటే కనీసం 2.5 మిలియన్ డాలర్లయినా వసూలు చేయాలి ?బ్రహ్మోత్సవం?. సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలంటే 3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాల్సిందే. ఐతే పక్కాగా యుఎస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లుగా హోల్ సేల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిపిస్తున్న ?బ్రహ్మోత్సవం? పాజిటివ్ టాక్ తో మొదలైతే అదేమంత పెద్ద విషయం కాదు. ఫస్ట్ వీకెండ్ లోనే 1.5 మిలియన్ డాలర్లు రెండో వీకెండ్ అయ్యేసరికి 3 మిలియన్లు వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,