Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Mar-2017 11:46:56
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏదైనా విశేషం బయటికి వచ్చిందంటే.. ఆ హీరో అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కాచుకుని ఉంటారు. ఆ విశేషం బాగుంటే అభిమానుల సంబరాలు చూడొచ్చు. బాలేకుంటే యాంటీ ఫ్యాన్స్ హంగామా మొదలైపోతుంది. తాజాగా విడుదలైన కాటమరాయుడు పాట రెండో వర్గానికే ఎక్కువ అవకాశమిస్తోంది. నిన్న లాగే లాగే పాట రిలీజైన కొద్దిసేపటికే దీనిపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం మొదలైంది. ఈ పాట అంచనాల్ని అందుకోవడంలో విఫలమైన మాట వాస్తవం. పవన్ అభిమానులు ఏదో ఆశిస్తే.. ఈ పాట ఇంకేదోలా అనిపించింది.

పవన్-శ్రుతిల మధ్య డ్యూయెట్ అనగానే ఆకాశం అమ్మాయైతే తరహాలో ఊహించుకున్నారు ఫ్యాన్స్. కానీ ఈ పాట దానికి ఎంతమాత్రం దగ్గరగా లేదు. వినసొంపుగా అనిపించలేదు. అసలిది పవన్ కళ్యాణ్ పాటలాగే అనిపించలేదు. అనూప్ ఏదో డిఫరెంటుగా చేయబోయి అభిమానుల్ని నిరాశ పరిచాడు. యాంటీస్ సంగతలా ఉంచితే.. సగటు సంగీత ప్రియులు కూడా ఈ పాట విషయంలో పెదవి విరుస్తున్నారు. ఈ పాట పవన్ కళ్యాణ్ సినిమా స్థాయికి తగ్గట్లుగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకుముందు టెంపర్ సినిమాకు విమర్శలెదుర్కొన్నట్లే.. ఇప్పుడు కూడా అనూప్ రూబెన్స్ టార్గెట్ అయిపోయాడు.మిర్రా మిర్రా మీసం పాట ఓ మోస్తరుగా అనిపించడంతో లాగే లాగే.. కూడా ఓకే అన్నట్లే ఉంటుందని అంతా అనుకున్నారు

,  ,  ,  ,  ,  ,  ,