Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 15:22:56
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు వంశీ కెరీర్లో అతి పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం, హీరోగా రాజేంద్రప్రసాద్ కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం ?లేడీస్ టైలర్?. 1985 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వంశీ. ఇందులో యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రం కోనసీమ ప్రాంతంలోని మామిడికుదురు మండలం పెదపట్నంలోని వైనతేయ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడ చిత్రీకరిస్తున్న ఈ దృశ్యాలు సినిమాలో ఫ్రెష్ ఫీల్ ను అందిస్తాయని, కోనసీమ ప్రాంతపు అందాలన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతాయని సినిమా యూనిట్ చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది.

,  ,  ,  ,