Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2016 10:40:49
facebook Twitter Googleplus
Photo

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి.. ప్రతీ చిన్న అప్ డేట్ హాట్ న్యూస్ అయిపోతోంది. బాలయ్య వందో సినిమా కావడం.. చాలా ఏళ్ల తర్వాత రాజు గెటప్ లో బాలకృష్ణ కనిపించనుండడం. ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్.. తనే నిర్మిస్తుండడం.. ఈ మూవీ అంచనాలను పెంచేస్తున్నాయి.

గౌతమిపుత్ర శాతకర్ణి ముూవీలో గ్రాఫిక్స్ వర్క్ కు బోలెడంత ఇంపార్టెన్స్ ఉందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు.. ఈ మూవీకి హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. అసలు వీటి విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశ్యంతోనే.. మొదట మొరాకో.. జార్జియా షెడ్యూల్స్ ను ఫినిష్ చేశాడట దర్శకుడు. ఆ దేశాల్లో తెరకెక్కించిన యుద్ధాల సీక్వెన్స్ లపై ప్రస్తుతం 4 గ్రాఫిక్స్ టీమ్ లు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి నాటికల్లా శాతకర్ణి షూటింగ్ పూర్తయిపోతుందని అంటున్నారు.

అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. గ్రాఫిక్ వర్క్స్ ను చూసుకుంటూ.. డిసెంబర్ చివరి వారంలో ఆడియో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసిందట శాతకర్ణి యూనిట్. వచ్చే ఏడాది పొంగల్ స్పెషల్ గా రిలీజ్ కానున్న శాతకర్ణి.. బాలయ్య కెరీర్ లోనే స్పెషల్ గా నిలిచిపోయేందుకు క్రిష్ చాలా ప్రయత్నిస్తున్నాడు

,  ,  ,  ,  ,  ,