Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2015 10:58:20
facebook Twitter Googleplus
Photo

నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ చిత్రం 2011లో వచ్చిన ఫ్రెంచ్ సూపర్ హిట్ సినిమా 'ద ఇన్ టచబుల్స్' ఆధారంగా రూపొందుతుందని తెలుస్తోంది. పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి పక్షవాతం వచ్చి శరీరం చచ్చుబడిపోయిన వాడిలా నటించే ఓ వ్యక్తికీ, ఆసుపత్రిలో అతనికి సేవలు చేసే ఓ మేల్ నర్సుకీ మధ్య స్నేహబంధంతో ఈ సినిమా సాగుతుంది. ఇదే కనుక ఈ తెలుగు సినిమాకి స్పూర్తి అయితే, ఇందులో పేషెంటుగా నాగార్జున, మేల్ నర్సుగా కార్తీ నటిస్తారు. కార్తీ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. పీవీపీ సినిమా బ్యానర్ పై పొట్లూరి ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,