Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2016 11:44:50
facebook Twitter Googleplus
Photo

నెల కిందటే ?రోబో? సీక్వెల్ ?2.0? ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ఈ చిత్రం 2017 దీపావళికి రిలీజవుతుందని ప్రకటించేశాడు శంకర్. దాదాపు ఏడాది పాటు నిరీక్షించాల్సి ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్న ప్రేక్షకులందరూ ఒకింత నిరాశకు గురయ్యారు. అంటే ఇంకా షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ?2.0 గురించి ఈ సినిమా సౌండ్ డిజైనర్ రసూల్ పొకుట్టి ఇచ్చిన అప్ డేట్ చూసి షాకవ్వడం రజినీ అభిమానుల వంతయ్యింది. విడుదలకు ఇంకా పది నెలలకు పైగా సమయం ఉండగానే ?2.0? డబ్బింగ్ పూర్తి చేసేస్తున్నాడట సూపర్ స్టార్. మూడు రీళ్ల సన్నివేశాలకు ఒక్క రోజులోనే రజినీ డబ్బింగ్ పూర్తి చేసేశాడని.. ఆయన వేగం.. కమిట్మెంట్ అసాధారణం అంటూ ట్వీట్ చేశాడు రసూల్.

రసూల్ ట్వీట్ ను బట్టి ?2.0? షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయిందన్న క్లారిటీ వచ్చేసింది. విడుదలకు ముందు డబ్బింగ్ ఇతర పనులతో తలనొప్పులు లేకుండా ముందే ఆ పని పూర్తి చేయిస్తున్నట్లున్నాడు శంకర్. కొన్ని నెలల ముందు నుంచే ?2.0? గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్టుల పని మొదలైపోయింది. హాలీవుడ్ నిపుణులతో ప్రపంచ స్థాయి క్వాలిటీతో ఈ పనులు జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు ఏడాది పాటు ఈ పనులు జరగనున్నాయంటే ఔట్ పుట్ ఏ రేంజిలో ఉంటుందో అంచనా వేయొచ్చు.

,  ,  ,  ,  ,