Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2015 11:06:53
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న 'గబ్బర్ సింగ్ 2' సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ జూలై చివరివారంలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు మొదలవుతున్నట్టుగా సమాచారం. ఇటీవల 'పూణె'లో ఈ సినిమా మొదటి షెడ్యూలును పూర్తిచేసుకుంది. అయితే ఈ షెడ్యూల్లో పవన్ పాల్గొనలేదు.

రెండవ షెడ్యూల్ షూటింగులో ఆయన పాల్గొంటాడనీ, యాక్షన్ ప్రధానమైన కొన్ని సన్నివేశాలను తెరకెక్కించనున్నామని నిర్మాత శరత్ మరార్ కొన్నిరోజుల క్రితమే చెప్పాడు. దాంతో ఈ సినిమా షూటింగులో పవన్ పాల్గొనే సమయం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ షెడ్యూల్ ను గుజరాత్ లో ప్లాన్ చేశారు. జూలై చివరివారం నుంచి ఏకధాటిగా 40 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షూటింగులో పాల్గొనేందుకు పవన్ సిద్ధమవుతున్నాడు.

,  ,  ,